
భవుని వైభవం
ప్రభల తేజం..
● కనులపండువగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ● విశేష వాహనాలపై విహరించిన ఆదిదంపతులు
శ్రీకాళహస్తి : దక్షిణ కై లాసంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరంపై అధిష్టించి లయకారుని వెంట సాగారు. మూషిక వాహనంపై విఘ్నేశ్వరుడు, చప్పరాలపై శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప అనుసరించారు. మంగళవాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ ఆదిదంపతులు పురవిహారం చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే రాత్రి సర్వాలంకారశోభితులైన ఆదిదంపతులు చంద్రప్రభ, శుక వాహనాలపై కొలువుదీరి మాడ వీధుల్లో ఊరేగారు. కార్యక్రమాల్లో ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు.
మూడు కౌంటర్లలో టికెట్ల విక్రయం
నేడు రావణాసుర –
మయూర వాహనసేవలు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి రావణబ్రహ్మ వాహనంపై ముక్కంటీశుడు, మయూర వాహనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు పురవీధుల్లో విహరించనున్నారు. ఈ క్రమంలోనే9 ఉదయం పరమశివుడు హంసవాహనం, పార్వతీదేవి యాళి వాహనంపై పురవీధుల్లో ఊరేగనున్నారు.
మహాశివరాత్రి రోజున స్వామివారి దర్శనానికి స్థానికుల కోసం మూడు కౌంటర్లలో టికెట్లు విక్రయించనున్నట్లు ఈఓ బాపిరెడ్డి తెలిపారు. పట్టణంలోని భక్తకన్నప్ప సదన్, శ్రీప్రసన్న వరదరాజస్వామి అతిథిగృహం, సీఆర్‌ఓ కార్యాలయంలో ఒక్కో రూ.200 చొప్పున 24న ఉదయం 6 నుంచి రాత్రి 7గంటల వరకు, 25న ఉదయం 6 నుంచి సాయంత్రం 5గంటల వరకు విక్రయిస్తారని వెల్లడించారు. భక్తులు ఆధార్ కార్డు అందించి ఆయా కౌంటర్లలో టికెట్లు తీసుకోవచ్చని సూచించారు.
హర్షిత సూర్యకుమార్
గ్రీష్మితారెడ్డి

భవుని వైభవం

భవుని వైభవం
Comments
Please login to add a commentAdd a comment