ఎండీఎం నిర్వాహకుల పొట్ట కొట్టొద్దు
శ్రీకాళహస్తి : ఏఎంపుత్తూరు నుంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళల పొట్ట కొట్టొద్దని సీఐటీయూ నాయకులు సూచించారు. బాధిత డ్వాక్రా మహిళలతో కలిసి స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య మాట్లాడుతూ ఏఎంపుత్తూరు వేదికగా 20 మంది డ్వాక్రా మహిళలు పట్టణ వ్యాప్తంగా 14 ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లుగా ఎలాంటి రాజీలేకుండా ఎండీఎం నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళల పొట్ట కొట్టేందుకు శ్రీకాళహస్తి విద్యాశాఖలో పని చేస్తున్న ఎంఈవో స్థాయి వ్యక్తి కుట్ర చేస్తున్నాడంటూ ఆరోపించారు. డీఈవో స్పందించి ఆయనపై విచారణ జరపాలన్నారు.
పోర్టుల నిర్మాణంలో మాదే పైచేయి
– శాసన మండలిలో ఎమ్మెల్సీ మేరిగ
చిల్లకూరు: శాసన మండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మంగళవారం తన గళం విప్పారు. అధికార పార్జీ బూజు దులిపారు. దుగ్గరాజపట్నం పోర్టు విషయంపై అధికార పార్టీ చేసిన విమర్శలను ఆయన దీటుగా తిప్పికొట్టారు.
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
–15 కేజీల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట జీఆర్‌పీ ఎస్‌ఐ రవి తెలిపారు. ఆయన కథనం మేరకు.. రేణిగుంట రైల్వే స్టేషన్‌లోని మూడో ప్లాట్ ఫారంపై సోమవారం రాత్రి అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను తిరుపతి రైల్వే సబ్– డివిజినల్ పోలీస్ అధికారి ఎస్‌ఆర్ హర్షిత పర్యవేక్షణలో రైల్వే ఇన్‌స్పెక్టర్ పి.యతీంద్ర ఆదేశాలతో అదుపులోకి తీసుకొని పరిశీలించారు. వారి వద్ద 45 వేల విలువచేసే 15 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మంగళవారం వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన మిల్టన్‌షేక్ (28), మదన్ మండల్ (39)ను అదుపులోకి తీసుకుని విచారించగా తమ బ్యాగుల్లో గంజాయి తీసుకువస్తున్నట్లు ఒప్పుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి, నెల్లూరు రైల్వే కోర్ట్ వారి ఎదుట హాజరు పరిచారు. ఐపీ ఎఫ్ సందీప్‌కుమార్, ఆర్పీఎఫ్ ఎస్‌ఐ రమేష్, ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ రమేష్, కానిస్టేబుల్ ధనంజయ దాడుల్లో పాల్గొన్నారు.
ఎండీఎం నిర్వాహకుల పొట్ట కొట్టొద్దు
Comments
Please login to add a commentAdd a comment