బదిలీల చట్టంపై సమావేశం
తిరుపతి కల్చరల్ : ఉపాధ్యాయుల బదిలీల చట్టంపై బుధవారం తిరుపతిలోని ఎస్‌టీయూ భవనంలో సమావేశం నిర్వహించారు. ఎస్‌టీయూ రాష్ట్ర నేత గాజుల నాగేశ్వరరావు మాట్లాడుతూ బదిలీల చట్టంలోని అసంబద్ధాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌బాబు మాట్లాడుతూ చట్టం కారణంగా ఎవరూ నష్టపోకుండా సీనియారిటీ, స్టేషన్, ప్రిఫరెన్షియల్ కేటగిరీలకు సంబంధించి అందరికీ న్యాయం జరిగేలా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 117 జీఓ రద్దు పేరుతో ప్రాథమిక విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం చేయడం తగదన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ బడుల్లోని పిల్లలకు మాత్రమే పరిమితి చేయాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.జగన్నాథం మాట్లాడుతూ బదిలీల్లో చట్టంలోని నిబంధనలపై కోర్టుకు వెళ్లకూడదనే అంశాన్ని తొలగించాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్‌టీయూ నేతలు గురుప్రసాద్, రేణుకాదేవి, రామాంజనేయులు, వాసు, సురేష్, దేవేంద్ర, శ్రీనివాసులు,మురళీకృష్ణ, మహేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment