ఉపాధికి ‘సంకల్ప’ం
తిరుపతి అర్బన్ : నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంకల్ప పథకం కింద జిల్లావ్యాప్తంగా ఆరు చోట్ల 270 మందికి ఉచితంగా వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డీపీఓ సుశీలాదేవి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఈ మేరకు అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్టు, ఫ్యాబ్రిక్ కట్టర్, జనరల్ డ్యూటీ నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులకు సంబంధించి 90 మందికి నిర్వహిస్తున్న మూడు తరగతులను డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ విశ్వనాఽథడ్డి, ఉపాధి కల్పనాధికారి వెంకటరమణ, నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి లోకనాధం, డీఎస్‌టీఓ ఫర్జానా, డీఏ మురళి పరిశీలించారు. అలాగే నారావారిపల్లిలో వివిధ కోర్సుల్లో 100 మందికి చేపట్టిన శిక్షణ తరగతులను డీపీఓ సుశీలాదేవి సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment