తిరుపతి క్రైమ్: నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈస్ట్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి ఎస్‌టీవీ నగర్‌కు చెందిన అరవింద(22) గంజాయి అక్రమ రవాణా కేసులో ఇప్పటికే అన్నవరంలో ముద్దాయిగా ఉన్నాడు. ఇతనికి ఒడిశా రాష్ట్రం, చిత్రకొండ కు చెందిన గణేష్‌ను అన్నవరంలో పరిచయం చేసుకున్నాడు. ఇతని వద్ద లక్ష రూపాయలు ఇచ్చి ఐదుకిలోల గంజాయిని కొనుగోలు చేసి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కి తీసుకొచ్చాడు. అయితే రాహస్య సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గంజాయిని చిన్నచిన్న పొట్లాలుగా చేసుకొని ఒక్కొక్కటి రూ.300 చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment