నేత..మేత | - | Sakshi
Sakshi News home page

నేత..మేత

Published Fri, Mar 7 2025 9:14 AM | Last Updated on Fri, Mar 7 2025 9:10 AM

నేత..

నేత..మేత

ఉపాధి నిధులతో ఇష్టారాజ్యంగా సిమెంట్‌ రోడ్లు
● అనుమతి ఒకచోట.. నిర్మాణం మరో చోట ● కూటమి నేతల ఇళ్ల దగ్గరే రోడ్ల నిర్మాణం ● అయోమయంలో పేద జనం

చిల్లకూరు మండలం వివరాలు

సచివాలయాలు 17

పంచాయతీలు 30

గ్రామాలు 64

పనుల సంఖ్య 54

ప్రస్తుతం చేసిన పనులు 30

మంజూరైన నిధులు రూ.2.73 కోట్లు

ఖర్చు చేసింది రూ.1.5 కోట్లు

మొత్తం సీసీ రోడ్లు మీటర్లలో 6,396

పూర్తి చేసింది 3,690

పాత రోడ్డుపైనే రోడ్డు నిర్మాణం 1

నేతల ఇళ్ల వద్దకు వేసుకున్న రోడ్లు 3

ఇష్టానుసారంగా చేసిన పనులు 6

పనులు దక్కించుకున్న కూటమి నేతలు 45 మంది

చిల్లకూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు కూటమి నేతలకు కల్పతరువుగా మారాయి. పల్లె పండుగ పేరుతో గ్రామాలలో ఇష్టారాజ్యంగా సిమెంట్‌ రోడ్లు నిర్మించి నిధులు బొక్కేశారు. ఒక గ్రామంలో రెండు పార్టీలకు చెందిన నేతలు ఉంటే వారికి సమా నంగా అధికారులు పనులు అప్పగించారు. ఇంకా ముఖ్యమైన నేతలు ఉంటే అక్కడ నిధులు మరింతగా ఖర్చు చేసేలా పనులకు ఎస్టిమేషన్లు సిద్ధం చేశారు.

అను‘మతి ఉందా’?

చాలా గ్రామాలలో అనుమతులు ఒక చోట.. పనులు చేసేది మరో చోటగా మారింది. తమకు నచ్చిన చోట, తమ ఇళ్ల దగ్గరకు ఉండేలా కూటమి నేతలు సీసీ రోడ్లు నిర్మించారు. కొన్ని గ్రామాల్లో రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తిచేయలేదు. దళిత, గిరిజన కాలనీల్లో ఇంకా పనులు మొదలు పెట్టలేదు. సీసీ రోడ్డు పనులు ఆరంభించిన సమయంలో స్థానిక ప్రజాప్రతినిధి ఫొటో ఉన్న శిలాఫలకాలను ఆవిష్కరించి చేతులు దులుపుకున్నారు.

చిల్లకూరు మండలంలో పరిస్థితి ఇదీ

● మండలంలోని ఓడూరు గ్రామంలో గత 20 ఏళ్ల క్రితం నిర్మించిన సీసీ రోడ్డుపైనే మళ్లీ సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. గతంలో వేసిన రోడ్డు ఎత్తు తగ్గి పోవడమే కాకుండా అక్కడక్కడా పగిలి పోయిందన్న సాకుతో సీసీ రోడ్డును కొంత భాగం తొలగించి దాని స్థానంలో కొత్త రోడ్డు వేశారు. దీనిపై ఉపాధి, పీఆర్‌ అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

● తీర ప్రాంతంలో ఉన్న తమ్మినపట్నం పంచాయతీలో మత్స్యకార కాలనీ అయిన కొత్తూరులో సీసీ రోడ్డు వేయాల్సి ఉండగా అక్కడ కాకుండా గ్రామంలో రోడ్డు వేస్తున్నట్లు ఎస్టిమేషన్లు మార్చి గ్రామంలోని నాయకుల ఇంటి ముందు సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా సీసీ రోడ్లు పూర్తిచేశారు.

● తీర ప్రాంతంలోని వేళ్లపాళెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధి శిలాఫలకం వేశారు. ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణంలో వాడాల్సిన ఇసుక బదులుగా ఈ ప్రాంతంలో లబించే సిలికాను వినియోగించారు. దీనిపై పీఆర్‌ ఏఈని వివరణ క్వారగా క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు చూసుకుంటారని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

● తీర ప్రాంతంలోని మోమిడి గ్రామంలో రెండు సీసీ రోడ్లు నిర్మాణం చేపడితే ఇసుకకు ప్రత్యామ్నాయంగా అక్కడ దొరికే సిలికాను వాడారు. క్యూరింగ్‌ కూడా సక్రమంగా చేయలేదు.

● మండల తీర ప్రాంతలలోని తూర్పుకనుపూరు గ్రామంలో వేసిన సీసీ రోడ్లు ఒక వీధిలో వేయాల్సి ఉండగా తమకు అనుకూలమైన వారి ఇంటికి వెళ్లేలా అలైన్‌మెంట్‌ మార్చి రోడ్డు పనులు పూర్తి చేశారు. ఈ రోడ్డు వేసేందుకు స్థానిక నాయకులు ఆ ఇంటి యజమాని నుంచి కొంత మొత్తం వసూలు చేసుకున్నట్టు తెలుస్తోంది.

● దళిత, గిరిజనకాలనీల్లో ఇంకా సీసీరోడ్లు నిర్మించలేదు.

నాణ్యతకు తిలోదకాలు

తీర ప్రాంతంలోని పలు గ్రామాలలో ఇసుకకు బదులుగా సిలికాను వినియోగించారు. అధికారులు సూచించిన సిమెంటు కాకుండా మరో బ్రాండ్‌ సిమెంటును వినియోగించి పనులు పూర్తి చేశారు.

కంకరలోనూ కక్కుర్తి పడి లోకల్‌లో దొరికే చిప్స్‌ వేసి రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు.

రోడ్డుకు అడుగు భాగంలో ప్లాస్టిక్‌ పట్ట వేయాలి. అలాగే రోడ్డు మద్యలో పది అడుగులకు ఒక చోట బెర్ములు అమర్చాలి. కానీ వాటిని ఎక్కడా చేపట్టలేదు.

రోడ్డు నిర్మాణం చేపట్టే సమయంలో ఆయా సచివాలయాలయాల ఇంజినిరింగ్‌ అసిస్టెంట్లు దగ్గరుండి పనిచేయించాలి. ఒకేసారి రెండు మూడు చోట్ల పనులు జరుగుతుండడంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయలేక పోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేత..మేత1
1/7

నేత..మేత

నేత..మేత2
2/7

నేత..మేత

నేత..మేత3
3/7

నేత..మేత

నేత..మేత4
4/7

నేత..మేత

నేత..మేత5
5/7

నేత..మేత

నేత..మేత6
6/7

నేత..మేత

నేత..మేత7
7/7

నేత..మేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement