వైఎస్సార్‌సీపీలో నియామకం
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేపట్టారు. మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చిత్తూరు సంతపేటకు చెందిన జ్ఞాన జగదీష్‌ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఆయనకు ఉత్తర్వులు అందాయి.
అంతర్జాతీయ మాస్టర్స్
అథ్లెటిక్ పోటీలకు ఎంపిక
చిట్టమూరు : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్న పిడుగు భరత్ మహీపతి ప్రపంచ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం మీనాకుమారి గురువారం తెలిపారు. ఈనెల 4 నుంచి బెంగళూరులోని కంఠీరవ అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన 43వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలలో పాల్గొని హ్యామర్ త్రో విభాగంలో వెండి పథకం సాధించినట్టు వెల్లడించారు. అలాగే మేలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగే ప్రపంచ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలలో భారత దేశం తరఫున పాల్గొననున్నట్టు వివరించారు. భరత్ మహీపతిని ఉపాధ్యాయులు, ప్రజలు అభినంధించారు.
జాతీయ సైన్స్
వారోత్సవాల్లో ప్రతిభ
శ్రీకాళహస్తి: తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్ పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి, జాతీయ స్థాయి సైన్స్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణంలోని కుమారస్వామి తిప్ప వద్దనున్న మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ హుస్నా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘మీకు నచ్చిన శాస్త్రవేత్త’ అనే అంశంపై వ్యాసం రాసిన షేక్ హుస్నా, జిల్లా స్థాయిలో మొదటి బహుమతి గెలుపొందారు. ముఖ్యఅతిథులు గా విచ్చేసిన గాదంకిలోని యన్‌ఏఆర్‌యల్ డైరెక్టర్ పాత్రో, డీఈఓ కుమార్, ఏఎంఓ, జిల్లా సైన్స్ అధికారి భానుప్రసాద్‌లు విద్యార్థి ని అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కుమారస్వామి తిప్ప పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్ నౌజియా పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో నియామకం
వైఎస్సార్‌సీపీలో నియామకం
Comments
Please login to add a commentAdd a comment