బారికేడ్ల వితరణ
తిరుపతి కల్చరల్: నగరంలో ట్రాఫిక్ స్టేషన్‌కు శుక్రవారం భారతి సిమెంట్ కంపెనీ వారు 20 బారికేడ్లను వితరణగా అందజేశారు. ట్రాఫిక్ సీఐ సుబ్బారెడ్డి సమక్షంలో భారతి సిమెంట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ విజయవర్థన్‌రెడ్డి బారికేడ్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భారతి సిమెంట్ తిరుపతి డీలర్లు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 23 కంపార్టుమెంట్లు నిండాయి. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment