
గూడ్సు రైలు ఢీకొని వ్యక్తి మృతి
నాయుడుపేట టౌన్: నాయుడుపేట రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రైలు పట్టాలు దాటుతున్న కాపులూరు మణేయ్య(48) అనే వ్యక్తిని గూడ్పు రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సూళ్లూరుపేట రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కథనం.. కల్లిపేడు గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ కాపులూరు మణెయ్య, భార్య పిల్లలతో కలిసి మండల పరిధిలోని చిగురుపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. శనివారం మణెయ్య రైల్వే స్టేపన్ చివరి ప్లాట్‌ఫారమ్ నుంచి నడుచుకుంటు వెళ్లి రైలు పట్టాలు దాటుతున్నాడు. చైన్నె వైపు వెళ్లే గూడ్సు రైలు అతనిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment