
మహిళా పక్షపాతి జగనన్న
తిరుపతి మంగళం : మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి కొనియాడారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు. మేయర్ శిరీష మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో పేదల సంక్షేమం, మహిళాభ్యున్నతి కోసం కృషి చేసిన ఏకై క నాయకుడు జగనన్న మాత్రమేనన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించి అన్ని రంగాల్లో ఉన్నత స్థానాన్ని కల్పించారని కొనియాడారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాధవి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఆలోచనతో మహిళలకు అన్ని రకాలుగా తోడున్న నాయకుడు జగనన్న అన్నారు. కార్పొరేటర్ ఆరణి సంధ్య మాట్లాడుతూ జగనన్న పాలనలో మహిళలు మహారాణులుగా జీవించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు అణిచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వాపోయారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మహిళా కార్పొరేటర్లు అని చూడకుండా తమపై దాడులకు తెగబడ్డారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆదిలక్ష్మి, పుణీత, శాలిని, శ్రావణి, ప్రముఖ రచయిత మస్తానమ్మ, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
ఆయన పాలనలోనే మహిళలకు
సముచిత స్థానం
కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, అత్యాచారాలు
మహిళా దినోత్సవంలో వక్తలు

మహిళా పక్షపాతి జగనన్న
Comments
Please login to add a commentAdd a comment