‘ఓటేరు’ పరిరక్షణే లక్ష్యం
తిరుపతి రూరల్ : కబ్జా కోరల నుంచి ఓటేరు చెరువు పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు. బుధవారం ఓటేరు చెరువును పరిశీలించారు. నారాయణ మాట్లాడుతూ చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత అంటారని, చెరువులు పూడ్చేస్తుంటే చూస్తూ ఉంటారని విమర్శించారు. కార్యక్రమంలో నేతలు గుజ్జుల ఈశ్వరయ్య, రామానాయుడు, పి.మురళి, చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, జె .విశ్వనాథ్, బి.నదియా, కత్తి రవి, కె.శివారెడ్డి, కె.పద్మనాభ రెడ్డి, హేమలత, జయచంద్ర, వేణు బుజ్జమ్మ, పి.అంజయ్య పాల్గొన్నారు.
పోరాటమే నిత్యకృత్యం
తిరుపతి కల్చరల్ : జాస్వామ్యం పరిరక్షణలో భాగంగా పోరాటమే నిత్యకృత్యమని నారాయణ తెలిపారు. సాయినగర్‌లోని వైన్‌షాపు మార్పునకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడంపై సీపీఐ ఆధ్వర్యంలో పది రోజులుగా నిరసన చేపట్టామన్నారు. ఈ మేరకు విజయం సాధించినట్లు వెల్లడించారు. నేతలు జి.ఈశ్వరయ్య , రామానాయుడు, పి.మురళి, చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, కె.శివారెడ్డి పాలొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment