ఆల్జీబ్రాపై అవగాహన అవసరం
తిరుపతి సిటీ : గణితశాస్త్రంలో ఆల్జీబ్రా, ఆల్జీబ్రాయిక్ కీలకమని వాటిపై విద్యార్థులకు అవగాహన అవసరమని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు తెలిపారు. వర్సిటీ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్జీబ్రా, ఆల్జీబ్రాయిక్ నంబర్ థియరీ, ట్రోపాలజీ వాటి ఆవర్తనాలు అనే అంశంపై శిక్షణ తరగతులను బుధవారం ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ గణితశాస్త్రంలో కీలకమైన, క్లిష్టమైన అంశాలపై విద్యార్థులకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని తరగతులు నిర్వహించేందుకు వర్సిటీ ప్రొత్సాహం అందిస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి, ఐజర్ ప్రొఫెసర్ డీఎస్ నాగరాజా, గణితశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సి.జయసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
15 నుంచి ఈఏపీసెట్‌కు దరఖాస్తులు
తిరుపతి సిటీ : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ యూజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్–2025 (గతంలో ఎంసెట్)కు ఈనెల 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 24వ తేదీని దరఖాస్తులకు చివరి గడువుగా పేర్కొన్నారు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment