గుణాత్మక విద్య తప్పనిసరి
ఏర్పేడు(రేణిగుంట) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరిగా గుణాత్మక విద్యను అందించాలని, వారి సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ కేవీఎం కుమార్ ఆదేశించారు. బుధవారం ఏర్పేడు, పంగూరు కాంప్లెక్స్ సమావేశాలను ఆయన తనిఖీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అమలు చేయాల్సిన విద్యా ప్రణాళికలను వివరించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శివశంకరయ్య, ఎంఈఓలు ప్రేమలత, దయాకర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment