గడువులోపు ఇల్లు కడితే బోనస్
తిరుపతి అర్బన్ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–1 పథకంలో భాగంగా ఏప్రిల్ 30వ తేదీలోపు ఇల్లు నిర్మించుకుంటే ఇప్పటికే అందిస్తున్న రూ.1.80 లక్షలతోపాటు అదనపు నగదు అందించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గడువులోపు ఇల్లు కట్టుకుంటే ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరు చేస్తామని వెల్లడించారు. అయితే గత ఏడాది డిసెంబర్ 10వ తేదీ నాటికి ఇంటి నిర్మాణాలు ప్రారంభించిన వారు మాత్రమే అర్హులని వివరించారు. ఈ మేరకు లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు సర్వే చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment