డామిట్.. కథ అడ్డం తిరిగింది!
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని గాంధీరోడ్డులో బుధవారం చోరీ యత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సంక్షిప్తంగా..
చిత్తూరు నగరంలోని గాంధీరోడ్డు–లక్ష్మీ థియేటర్ కూడలి వద్ద ఓ మారుతి ఓమ్‌నీ వ్యాను వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఆరుగురికి పైగా వ్యక్తులు ఎదురుగా ఉన్న ‘పుష్ప షాపింగ్ కిడ్ వరల్డ్’ దుకాణంపైన ఉన్న చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడ్డారు.
మొహానికి మాస్కులు, టోపీలు పెట్టుకున్న వ్యక్తులు చంద్రశేఖర్, అతని తల్లి సరస్వతి, భార్య శాంతి వైపు తుపాకులు చూపించి, బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు నగలు బ్యాగులో వేయాలని చెబుతుండగా.. చంద్రశేఖర్ పెద్దగా కేకలు వేయడంతో పైఅంతస్తులో ఉన్న కుమారుడు లోకేష్, ఇతని భార్య మానస పరుగు పరుగున కింద అంతస్తులోకి వచ్చారు. వాళ్లకు తుపాకీ చూపి కింద కూర్చోపెట్టారు.
చంద్రశేఖర్ ప్రతిఘటించడంతో తల, చేతికి గాయాలయ్యాయి. నిందితుల్లో ఒకరు బొమ్మ తుపాకీ పేల్చగా, అతి టప్ మంటూ శబ్దం చేసింది. వెంటనే తప్పించుకున్న లోకేష్ రోడ్డుపైకి వచ్చి సాయం కోసం అరవడం, చంద్రశేఖర్ మిద్దైపె నుంచే దొంగలు అని కేకలు వేశారు.
స్థానికంగా టీ తాగడానికి వచ్చిన ఉమాపతి, అతని స్నేహితులు హుటాహుటిన దొంగలు ఉన్న భవనంలోకి ప్రవేశించారు. వీళ్లను చూసిన వెంటనే ఇద్దరు పారిపోయారు. ఇక ఉమాపతి గొంతుకు కత్తి పెట్టడంతో నిందితుడిని కాలితో తన్నాడు. కత్తి కిందపడడంతో స్థానికులంతా కలిసి నిందితులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. తాళ్ల సాయంతో నలుగురు నిందితులను కట్టేసి, పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురు నిందితులను స్థానికులు, పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు తుపాకులతో ఇంట్లోనే ఉన్నట్లు చెప్పడంతో అలజడి మొదలైంది. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య తన సిబ్బందితో కలిసి మరో భవనం నుంచి చంద్రశేఖర్ ఇంట్లోకి ప్రవేశించారు. అందర్నీ బయటకు తీసుకొచ్చారు.
ఎస్పీ మణికంఠ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వద్ద ఆయుధాలున్నాయనే సమాచారం రావడంతో సాయుధ బలగాలను రప్పించారు. బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు ధరించి చేతుల్లో తుపాకులు పట్టుకున్న అధికారులు, సిబ్బంది భవనం లోపలకు వెళుతున్నారు, బయటకు వస్తున్నారు. కానీ ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడంలేదు.
నిందితులు వచ్చిన కారుకు తమిళనాడుకు చెందిన ద్విచక్రవాహన నంబర్ వేసుకోవడంతోపాటు, ప్రెస్ అని స్టిక్కర్ వేసుకోవడం, కారులో కత్తి, పెట్రోలు గుర్తించిన పోలీసులు దీన్ని చిన్న ఘటనగా భావించలేదు. విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
తిరుమలలో ఉన్న ఆక్టోపస్ బలగాల సాయం తీసుకోవాలని డీజీపీ చెప్పడంతో.. ఎస్పీ మణికంఠ వారిని చిత్తూరుకు రప్పించారు.
20 మందికి పైగా ఉన్న ఆక్టోపస్ బలగాలు ఘటనా స్థలం మొత్తాన్ని జల్లెడ పట్టాయి. చుట్టుపక్కల భవనాల్లో సైతం వెతికినా పారిపోయిన నిందితుల ఆచూకీ లభ్యం కాలేదు.
పోలీసుల ఆపరేషన్ ముగిసింది. అందరూ వెనుతిరుగుతున్న సమయంలో...
ఘటన జరిగిన భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో బ్యాంకు ఉంది. దొంగలు బ్యాంకులో దాక్కున్నారా..? బ్యాంకును దోచుకోవడానికి వచ్చారా..? అనే ప్రశ్నలు తలెత్తడంతో మళ్లీ ఆక్టోపస్ బలగాలు బ్యాంకులోకి తుపాకులతో ప్రవేశించి, వెతికినా ఎవరూ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుని ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయారు.
‘‘ఊరంతా అప్పులు. ఒక్క దోపిడీ చేస్తే, వచ్చేదాంతో అప్పులన్నీ కొట్టేయచ్చు. చోరీల్లో ఆరితేరినవాళ్లను సాయం అడిగితే వచ్చేదాంట్లో వాటాలు అడుగుతారు. తలా రూ.2 వేలు ఇస్తే నా వద్ద పనిచేసేవాళ్లే వచ్చేస్తారు. ఇక అంతా సిద్ధం. పదండి లోపలకు..’’ అన్నాడు ముఠా నాయకుడు. డామిట్ అప్పుడే కథ అడ్డం తిరిగింది. భవన యజమాని ప్రతిఘటించాడు. స్థానికంగా ఉన్న యువకులు పిచ్చ కొట్టొడుకొట్టారు. ఒకరి కాలు విరిగింది. మరొకరికి మొహం మారిపోయింది. తీరా పోలీసుల రంగ ప్రవేశంతో ఉత్కంఠత నెలకొన్నా.. చివర్లో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.
ఒక్క దోపిడీతో.. అప్పులన్నీ కొట్టేద్దామనే ఆశ చిత్తూరులో రచ్చరచ్చ చేసిన కొత్త దొంగలు బొమ్మ తుపాకీలతో పట్టపగలు ఇంట్లో చోరీకి యత్నం ప్రతిఘటించిన యజమాని.. స్థానికులే హీరోలైన వైనం
జిల్లా ఎస్పీ నుంచి.. ఆక్టోపస్ బలగాల పరుగులు
కంటిమీద కునుకులేక.. ఆపై ఊపిరి తీసుకున్న ఖాకీలు
10 గంటలు:
7.47 గంటలు:
సీన్ కట్ చేస్తే..
చిత్తూరు నగరంలోని కలెక్టరేట్ భవనం వెనుక ఉన్న జీకే నగర్‌లో కాపురముంటున్న సుబ్రమణ్యంరెడ్డి 16 ఏళ్ల క్రితం కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ సోఫాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. అందరికీ అప్పులు ఇచ్చి, ఆర్థికంగా నష్టపోవడంతో ఒక్క దోపిడీ చేసి అప్పులన్నీ సెటిల్ చేద్దామని ఇలా తొలి ప్రయత్నంగా చోరీకి ప్రయత్నించి చావుదెబ్బలు తిని.. కటకటాలపాలయ్యాడు. సుబ్రమణ్యంరెడ్డితోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన నవీన్, ఇబ్రహీమ్ బాషా, ప్రవీణ్, రామాంజనేయులు పోలీసులకు చిక్కగా.. రాజేష్‌తో పాటు మరో ఇద్దరు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గురువారం ఈ ఘటనపై వివరాలను మీడియాకు వివరించే అవకాశం ఉంది.
ఉదయం 6.28 గంటలు:
6.57 గంటలు:
8.10 గంటలు:
ఉదయం 6.35 గంటలు:
7.23 గంటలు:
9 గంటలు:
9.30 గంటలు:
6.40 గంటలు:
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
Comments
Please login to add a commentAdd a comment