రైల్వే ఉద్యోగం పేరుతో టోకరా
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి వారి వద్ద నుంచి రూ.కోట్లు కాజేసిన ఘరానా మోసగాడి ఉదంతం బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ క్రమంలో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. వివరాలు.. రేణిగుంట మండలం ఎస్‌ఎన్ పురానికి చెందిన కృష్ణమూర్తి సీఆర్‌ఎస్‌లో రైల్వే ఉద్యోగిగా పనిచేసేవాడు. ఈ మేరకు రైల్వేలో ఉద్యోగాలు ఉన్నాయని, తాను ఇప్పిస్తానంటూ పలువురి నుంచి సుమారు రూ.2కోట్లు వసూలు చేశాడు. తర్వాత సమాధానం చెప్పకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గతంలోనూ ఈ ఘనుడిపై గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదై ఉంది. ఈ క్రమంలోనే రెండు నెలలల క్రితం 12 మంది బాధితులు తమ వద్ద రూ.10లక్షల చొప్పున వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బుధవారం రైల్వేకోడూరుకు చెందిన కొందరు తమను కూడా కృష్ణమూర్తి మోసం చేసినట్లు రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ విధంగా ఎంతమంది సదరు కృష్ణమూర్తి చేతిలో మోసానికి గురయ్యారో తేలుస్తామని పోలీసులు వెల్లడిస్తున్నారు.
పరశురామేశ్వరుని సేవలో శ్రీరాములు
ఏర్పేడు(రేణిగుంట) : ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన పరశురామేశ్వరుని బుధవారం కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సేవించుకున్నారు. ఆలయ ఈఓ రామచంద్రారెడ్డి, పాలకమండలి మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment