చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
నారాయణవనం: ప్రభుత్వ వైద్యశాలల్లోని ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ల్యాబ్ టెక్నీషియన్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోగికి వైద్య సేవలు అందాలంటే రోగ నిర్ధారణ చేస్తున్న టెక్నీషియన్ల పాత్ర కీలకమని తెలిపారు. గ్రేడ్–2 క్యాడర్‌లోనే ఉద్యోగంలో చేరి, అదే క్యాడర్‌లో విరమణ చెందే దౌర్భాగ్యం తమదేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్లు, జోనల్ క్యాడర్‌గా మార్పు, పీహెచ్‌సీలలో 2వ ల్యాబ్ టెక్నిషియన్ పోస్ట్ మంజూరు, ల్యాబ్‌ల ఆధునీకరణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఇంటర్ పరీక్షకు
598 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు బుధవారం జిల్లా వ్యాప్తంగా 598 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 86 కేంద్రాల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించారు. జనరల్‌లో 28,599మంది, ఒకేషనల్‌లో 1,040మంది మొత్తం 29,639మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 29,041మంది మాత్రమే పరీక్ష రాసినట్లు ఆర్‌ఐఓ జీవీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఫస్టియర్ విద్యార్థులకు కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment