పోటీతత్వంతో ఉన్నత భవిత
నారాయణవనం:యువ ఇంజినీర్లు పోటీ తత్వం పెంపొందించుకుంటే ఉన్నత భవిష్యత్ పొందవచ్చని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు తెలిపారు. బుధవారం కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో జుబిలేషన్ డే నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అశోక్‌రాజు మాట్లాడుతూ జీవితంతో ఎంత ఎత్తుకు ఎదిగినా, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలని సూచించారు. మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. అనంతరం ఆయనను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలోనే వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జుబిలేషన్‌లో భాగంగా గురువారం చేపట్టే కార్యక్రమాలకు జేఎన్‌టీయూ అనంతరపురం వీసీ సుదర్శనరావు, సినీనటి సంయుక్తా మీనన్, యాంకర్ భానుశ్రీ హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment