వాగులో మునిగి విద్యార్థి మృతి
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : రేణిగుంట మండలం మామండూరులో వాగులో మునిగిపోయి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. అనంతపురం జిల్లాకు చెందిన వివేక్(21) రేణిగుంట మండలంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం కాలేజీకి సెలవు ఇవ్వడంతో ఐదుగురు స్నేహితులతో కలిసి మాముండూరు పర్యాటక కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడి నీటి వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. స్నేహితులు వెంటనే వెలికి తీసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment