రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చిల్లకూరు : కోట క్రాస్ రోడ్డు సమీపంలోని నెలబల్లిరెట్టపల్లెకు వెళ్లు మార్గం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. గూడూరు రూరల్ మండలం పోటుపాళానికి చెందిన మోరా శ్రీనివాసులు(38) బైక్‌పై శ్రీకాళహస్తికి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపు తప్పి హైవే అథారిటీ వారు ఏర్పాటు చేసిన ఎస్‌ఓఎస్ బాక్సును ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. గూడూరు డీఎస్పీ గీతాకుమారి ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment