స్వర్ణ నారావారిపల్లి క్లస్టర్లో భారీ స్కామ్
● అక్రమ నిర్మాణాల్లో ఉచిత సోలార్‌ను అమర్చిన అధికారులు ● నివాసం ఉన్న ఇళ్లకు కాకుండా అక్రమ నిర్మాణం చేపట్టిన షెడ్డుకు సోలార్ ఏర్పాటు
చంద్రగిరి: ‘సోలార్ విద్యుత్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇందు కోసం నా స్వగ్రామం నారావారిపల్లిని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నా. స్వర్ణ నారావారిపల్లి క్లస్టర్ పేరుతో ఏ.రంగంపేట నుంచి మూలపల్లి వరకు ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్‌ను వినియోగించేలా ఉచితంగా కనెక్షన్‌లను అందజేసి, ప్రజల్లో వాటి వినియోగం పెంచేలా అవగాహ కల్పించడమే ఉద్దేశం’ అంటూ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలకు అధికారులు ఉప్పొంగిపోయారు. అర్హులైన లబ్ధిదారులకు స్వర్ణ నారావారిపల్లి క్లస్టర్ ప్రాజెక్టు కింద విద్యుత్ సోలార్‌ను అమర్చాల్సి ఉంది. అయితే అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని ఏ.రంగంపేట సమీపంలోని నాగపట్ల లెక్కదాఖల సర్వే నం.80/ఏలో 8.31 సెంట్ల ప్రభుత్వ తోపు పోరంబోకు భూమి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏ.రంగంపేటకు చెందిన ఓ వ్యక్తి సుమారు రూ.50లక్షల విలువైన 100 అంకణాల భూమిని దర్జాగా అక్రమించేశాడు. అపై అక్రమంగా షెడ్డును నిర్మించి, బౌండరీని ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై గతంలోనే పలు ఫిర్యాదు వెళ్లాయి. అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, ఎవరికీ పట్టాలు మంజూరు చేయలేదని, అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వకూడదంటూ రెవెన్యూ అధికారులు సైతం విద్యుత్ శాఖ అధికారులకు సర్కులేషన్‌ను అందించారు. అవన్నీ పక్కనబెట్టిన విద్యుత్ అధికారులు అక్రమ షెడ్డుకు విద్యుత్ కనెక్షన్‌ను మంజూరు చేశారు.అధికార పార్టీకు చెందిన ఓ వ్యక్తి ఓ ప్రజాప్రతినిధికి మీడియా పీఏ అంటూ చెప్పుకుని అక్రమంగా నిర్మించిన షెడ్డులో ఎవరూ నివాసం లేకపోయినా ఉచిత సోలార్ సిస్టెమ్‌ను అమర్చుకోవడం ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
స్వర్ణ నారావారిపల్లి క్లస్టర్లో భారీ స్కామ్
Comments
Please login to add a commentAdd a comment