చిరుధాన్యాలతో అధిక లాభాలు
తిరుపతి సిటీ: చిరుధాన్యాలతో అధిక లాభాలు పొందవచ్చని ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ కరీముల్లా పేర్కొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అఖిల భారత జొన్న, చిరుధాన్యాల సమన్వయ పరిశోధనా పథకం ఆధ్వర్యంలో గురువారం షెడ్యూల్డ్ కులాల మహిళా రైతులకు చిరుధాన్యాలతో తయారు చేసే పలు రకాల పదార్థాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మహిళలకు అవగాహన కల్పించారు. ఆహారపు అలవాట్లు సైతం మారకతప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం వంట పాత్రలను, చిరుధాన్యాల ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసే కిట్‌ను మహిళకు అందజేశారు. ఏడీఆర్ డాక్టర్ సుమతి, డాక్టర్ కదిరిమోహన్ హాజరయ్యారు
Comments
Please login to add a commentAdd a comment