కంటైనర్ లారీ ఢీకొని మహిళ మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: ద్విచక్ర వాహనాన్ని వెనుకవైపు నుంచి కంటైనర్ లారీ ఢీ కొనడంతో మహిళ మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు గాయాలైన ఘటన వెస్టువరత్తూరు గ్రామం వద్ద కేటీరోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి మండలం, రామాపురం గ్రామ ఎస్టీ కాలానికి చెందిన రజనమ్మ(30), భర్త రమణయ్య, మామ సుబ్బరామయ్యతో కలసి పెద్దపాండూరు గ్రామంలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యంలోని వెస్టు వరత్తూరు గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని తిరుపతి నుంచి చైన్నెకి వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా ఢీ కొంది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రజనమ్మకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రమణయ్య, సుబ్బరామయ్యకు గాయాలయ్యాయి. రమణయ్య, సుబ్బరామయ్యను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తికి 108 అంబులెన్స్‌లో తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విశ్వనాథనాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment