‘ఓపెన్’గానే పరీక్షలు
వెంకటగిరి రూరల్ : దూర ప్రాంతాల్లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు మాస్ కాఫీయింగ్‌కు దారితీస్తున్నాయి. ఓపెన్ ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు వెంకటగిరిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి సిట్టింగ్ స్క్వాడ్ –2, ఇన్విజిలేటర్లు –10 మంది, చీఫ్–1, డిపార్టమెంట్ అధికారి–1 మొత్తం 12 మందిని ఏర్పాటు చేశారు. విద్యార్థులను పాస్ చేయడమే లక్ష్యంగా కొన్ని కళాశాలల నిర్వాహకులు మాస్‌కాపింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు సమర్పించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment