వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా వెంకటరమణ
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టి.వెంకటరమణను చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది.
టర్మ్ ఫీజుతో ముడిపెట్టడం దారుణం
తిరుపతి సిటీ: ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో అల్లాడిపోతున్న విద్యార్థులకు వర్సిటీ అధికారులు తలనొప్పిగా మారారని ఏఐఎస్‌ఏ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రంజిత్ కుమార్, చిన్న ఆవే ఛీన వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులు టర్మ్ ఫీజు చెల్లించనిదే సెమిస్టర్ పరీక్ష ఫీజులకు అనుమతి ఇవ్వకపోడం దారుణమన్నారు. ఈ మేరకు వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భాస్కర్‌రెడ్డికి గురువారం వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పూర్తిగా విడుదల కావడంలేదని, కానీ వర్సిటీ అధికారులు పీజీ విద్యార్థులకు టర్మ్ ఫీజు చెల్లించిన తర్వాతనే సెమిష్టర్ ఫీజు కట్టించుకుంటామంటూ నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. తక్షణం అధికారులు సెమిస్టర్ పరీక్షఫీజులు కట్టించుకోవాలని, లేని పక్షంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏఐఎస్‌ఎ నాయకులు రాజు, వేణు, కృష్ణవంశీ, వంశీ పాల్గొన్నారు.
హిటాచీ సీజ్
తిరుపతి రూరల్: స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుకను తోడేస్తున్న హిటాచీను తిరుపతి రూరల్ పోలీసులు సీజ్ చేశారు. గురువారం తిరుపతి రూరల్ మండలం, చిగురువాడ సమీపంలోని స్వర్ణముఖి నదిలో కొంత మంది అక్రమార్కులు ఇసుకను అక్రమంగా తోడేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హిటాచీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా వెంకటరమణ
Comments
Please login to add a commentAdd a comment