తాకట్టు నగలు చోరీ కేసులో అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్
సత్యవేడు: నాగలాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన నగల చోరీ కేసులో ఆ బ్యాంకు అసిస్టెంట్‌మేనేజర్ ఏ.సూర్యతేజను అరెస్టు చేసినట్టు సీఐ మురళి తెలిపారు. ఈ మేరకు గురువారం నిందితుడిని అరెస్ట్ చూపారు. తిరుపతి రీజినల్ మేనేజర్ వీ.బ్రహ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు పై నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో గత నెల ఫిబ్రవరి 21న కేసు నయోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మార్చి 12వ తేదీన నాగలాపురం ఈస్టు చర్చి వద్ద ముద్దాయిని అరెస్టు చేసి బంగారు నగలు తాకట్టు పెట్టిన రసీదులు స్వాధీనం చేసుకున్నారు.
జరిగింది ఇలా..
బ్యాంకు మేనేజర్ తిరైవరాజ్ ,అసిస్టెంట్ మేనేజర్ ఏ.సూర్యతేజ బంగారు నగల లాకర్‌కు కస్టోడియన్లుగా ఉన్నారు. నగలు ఉన్న లాకర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు ఇద్దరూ ఉండాల్సి ఉంది. బ్యాంకు మేనేజరు నిర్లక్ష్యం కారణంగా దానిని ఆసరగా తీసుకొన్న అసిస్టెంట్‌మేనేజర్ 30 మంది బంగారు నగలు (2,634 గ్రాములు) దొంగతనంగా బ్యాంకు నుంచి తీసుకొని ఇతర బ్యాంకులు, వివిధ ప్రయివేటు ఫైనాన్స్ సంస్థల నుంచి తనపేరున రుణం, మరో 11 పేర్లతో 37 సార్లు బంగారు నగలు మార్చిమార్చి తాకట్టుపెట్టి రూ.1.3 కోట్ల రుణం పొందాడు. ఆ డబ్బును ఆన్‌లైన్ జూదమాడి పోగొట్టుకున్నాడు. ఫిబ్రవరి 10న జోనల్ ఆడిట్‌అధికారి రాజ్‌కమల్ నాయక్ తనిఖీ చేపట్టారు. అడిట్ చేపట్టిన సమయంలో లాకర్ పరిశీలిచగా 11 మంది పేరిట ఉండాల్సిన ఆభరణాలు లేకపోవడంతో.. అసిస్టెంట్ మేనేజర్‌ను ఫోన్‌లో సంప్రదించగా నేరాలు ఒప్పుకోవడంతో ఆడిట్ అదికారి అవాక్కయ్యారు. బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లను ఫిబ్రవరి 11న సస్పెండ్ చేశారు. వారి స్థానంలో కొత్తగా మేనేజర్‌గా నాగమునేంద్ర, అసిస్టెంట్ మేనేజర్‌గా విజయ్‌శేఖర్ నియమించారు. రెండో ముద్దాయిగా ఉన్న మేనేజర్ తిరైవరాజ్‌ను త్వరలో అరెస్టు చేస్తామన్నారు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment