చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Published Fri, Mar 14 2025 1:01 AM | Last Updated on Fri, Mar 14 2025 1:00 AM

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం

తిరుపతి తుడా: మహిళా సాధికారతను సాధించడానికి, స్వీయ రక్షణ కోసం రాజ్యాంగం అనే చట్టాల ద్వారా హక్కులను కల్పించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ ఎస్వీఎన్‌ భట్టి పేర్కొన్నారు. స్విమ్స్‌ పద్మావతి ఆడిటోరియంలో గురువారం చట్టం, మహిళా సాధికారత అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. చట్టాలపై మహిళలకు అవగాహన ఉండాలన్నారు. భారత రాజ్యాంగం మహిళలకు సమానత్వాన్ని ప్రసాధించిందన్నారు. సాధికారత అంటే ఎగుమతి, దిగుమతి చేసుకునే సరుకు కాదని గుర్తుచేశారు. మహిళలు తమకు తాముగా సాధికారతను సాధించుకోగలరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సాధికారిత, లింగ సమానత్వంపై అడిగిన ప్రశ్నలను ఆయన నివృత్తి చేశారు. డాక్టర్‌ ఆర్వీ కుమార్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement