● ముదురుతున్న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వ్యవహారం ● ఘర్షణలు, దాడులు, కిడ్నాప్‌లు, ఆస్తుల ధ్వసంపై న్యాయపోరాటం ● దుశ్చర్యపై పార్లమెంట్‌ వేదికగ గళమెత్తిన ఎంపీ గురుమూర్తి ● మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కన్నెర ● సీబీఐ దర్యాప్తును కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ | - | Sakshi
Sakshi News home page

● ముదురుతున్న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వ్యవహారం ● ఘర్షణలు, దాడులు, కిడ్నాప్‌లు, ఆస్తుల ధ్వసంపై న్యాయపోరాటం ● దుశ్చర్యపై పార్లమెంట్‌ వేదికగ గళమెత్తిన ఎంపీ గురుమూర్తి ● మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కన్నెర ● సీబీఐ దర్యాప్తును కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ

Published Fri, Mar 14 2025 1:03 AM | Last Updated on Fri, Mar 14 2025 1:02 AM

● ముద

● ముదురుతున్న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వ్యవహారం ● ఘర్షణలు

తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో జరిగిన ధమనకాండపై వైఎస్సార్‌సీపీ నేతలు న్యాయపోరాటానికి దిగారు. దీనిపై తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యస్వామి సైతం స్పందించారు. ఈ ఎన్నిక వ్యవహారంపై లోతైన విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టు తలుపుతట్టారు. అలాగే తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి ఆధారాలతో సహా పార్లమెంట్‌లో గళ మెత్తారు. దీన్ని రాష్ట్ర హైకోర్టు సైతం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు డీజీపీ, హోం శాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీచేసింది. మానవ హక్కుల కమిషన్‌ సైతం విచారణకు ఆదేశించింది. నేడో రేపో పార్లమెంట్‌ కార్యాలయం సైతం స్పందించనుంది. ఇలా అన్ని రకాలుగా పోలీసులు, అధికారులు నాడు దౌర్జన్యకాండకు దిగిన టీడీపీ, జనసేన నేతలకు ఉచ్చు బిగియనుంది.

తిరుపతి తుడా: తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికను గతనెల 3వ తేదీన నిర్వహించారు. తిరుపతి కార్పారేషన్‌ 50 డివిజన్‌లు ఉండగా, గతంలో 49 డివిజన్లకు ఎన్నకలు నిర్వహించారు. ఇందులో టీడీపీ నుంచి ఒక్కరు మాత్రమే గెలుపొందారు. 4వ డివిజన్‌ కార్పొరేట్‌గా ఉన్న డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పదవికి రాజీనామా చేశారు. అనార్యోగంతో 24వ డివిజన్‌ కార్పొరేటర్‌ మృతి చెందారు. ఇలా మొత్తం 47 మంది కార్పొరేటర్లలో 46 మంది వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలుపొందినవారే ఉన్నారు. డెప్యూటీ మేయర్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించి ఉంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డిప్యూటీ మేయర్‌గా విజయం సాధించి ఉండేవారు.

బలం లేకపోయినా బరితెగింపు

కూటమి నేతలు తమకున్న 35వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణను డెప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో బరిలోకి దింపారు. ఈ క్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సైతం తిరుపతిలో తిష్ట వేసి ఉన్నతాధికారులను సైతం పిలిపించుకుని గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని హుకుం జారీ చేసినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి తమ వైపుకు తిప్పుకున్నారు. అప్పటికీ కూటమి అభ్యర్థికి 11 మంది మాత్రమే బలం ఉంది. దీంతో రంగప్రవేశం చేసిన తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఆస్తులపై దండయాత్ర ప్రారంభించారు. మరో కార్పొరేటర్‌కు చెందిన వ్యాపారాలను సీజ్‌ చేస్తామంటూ హెచ్చరికలు జారీచేశారు. దానికితోడు ఐదుగురు కార్పొరేటర్లను ఎన్నికలు జరిగే వేదిక సమీపంలోనే కిడ్నాప్‌ చేశారు. కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి భయబ్రాంతులకు గురిచేశారు. కార్పొరేటర్లు బస చేస్తున్న హోటల్‌పై అర్ధరాత్రి వేళ అరాచకం సృష్టించారు. ఎన్నిక రోజు పోలింగ్‌కు వచ్చిన కార్పొరేటర్ల వాహనంపై దాడికి తెగబడ్డారు. వాహనాన్ని ధ్వసం చేసి బస్సులోని కార్పొరేటర్లను కొట్టుకుంటూ టీడీపీ, జనసేన నేతల తమ సొంత వాహనాల్లో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. కార్పొరేటర్లను పోలింగ్‌కు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీసీ పుటేజ్‌లు, పేపర్‌ క్లిపింగ్‌లు, నాడు దాడి జరిగిన విజువల్స్‌ ఆధారంగా వైస్సార్‌సీపీ న్యాయ పోరాటానికి దిగింది.

టీడీపీ, జనసేన నేతల్లో టెన్షన్‌

అల్లర్లు, దాడులు, కిడ్నాప్‌ వ్యవహారాలపై ఆధారలతో సహా ఫిర్యాదు చేయడంతో ఓ పక్క మానవ హక్కుల కమిషన్‌, మరో పక్క రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం తీవ్రంగా స్పందించాయి. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సీపీ పుటేజ్‌లు, వీడియో టేపులు, ఫొటోల ఆధారంగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దాడులు, కిడ్నాప్‌ వ్యవహారం పూర్తిగా విజువల్స్‌లో ఉండడంతో టీడీపీ, జనసేన నేతలలో టెన్షన్‌ మొదలైంది. కేసుల వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుంది ఆందోళ చెందుతున్నారు.

నాటి అల్లర్లపై స్పందించిన హైకోర్టు

డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో చోటు చేసుకున్న వ్యవహారం పై బీజేపీ మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యస్వామి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు వ్యవహారం ముదురుతుండడంతో పోలీసు అధికారులు, ఆస్తుల కూల్చివేతకు దిగిన టౌన్‌ ప్లాన్‌ అధికారుల్లో ఆందోళ నెలకొంది. రాజకీయ కుట్రకు తాము బలికాకతప్పదన భయం పట్టుకుంది.

మానవ హక్కుల కమిషన్‌ కన్నెర్ర

ఎక్స్‌ అఫిషియో సభ్యుని హోదాలో డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి కార్పొరేటర్లతో కలసి ఎస్వీయూ సెనేట్‌ హాల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన మూకలు ఎంపీపై దురుసుగా ప్రవర్తించాయి. దీంతో ఆయన జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆధారలతో సహా కమిషన్‌ ముందు ఉంచారు. ఇందుకు కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీ పుటేజ్‌లు, వీడియో క్లిప్లింగ్‌లు, పేపర్‌ కటింగ్‌లను సైతం మానవహక్కుల కమిషన్‌కు అందజేశారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. త్వరలో విచారణ బృందం ఈ వ్యవహారంపై విచారించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
● ముదురుతున్న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వ్యవహారం ● ఘర్షణలు1
1/3

● ముదురుతున్న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వ్యవహారం ● ఘర్షణలు

● ముదురుతున్న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వ్యవహారం ● ఘర్షణలు2
2/3

● ముదురుతున్న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వ్యవహారం ● ఘర్షణలు

● ముదురుతున్న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వ్యవహారం ● ఘర్షణలు3
3/3

● ముదురుతున్న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వ్యవహారం ● ఘర్షణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement