
కర్రలతో ఇరువర్గాల దాడులు
నాయుడుపేటటౌన్: కర్రలతో ఇరువర్గాలు దాడి చేసుకున్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. పట్టణంలోని సంజయ్‌గాంధీ కాలనీలో నివాసం ఉంటున్న రామనారాయణ, రవి కుటంబాల మధ్య గతంలో గొడవలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మరళా గురువారం రాత్రి గొడవ పడ్డారు. దీంతో ఇరువార్గలకు చెందిన కుటంబ సభ్యులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రామనారాయణ, రవికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
చిత్తూరు అర్బన్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు రాష్ట్ర మైనారిటీ విభాగం జోనల్ అధ్యక్షుడిగా షఫీ అహ్మద్ ఖాద్రీ, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శులుగా ఎస్‌డీ అబ్బాస్, మహీన్, మహ్మద్ మగ్దూం మొహిద్దీన్, రాష్ట్ర మైనారిటీ విభాగం సంయుక్త కార్యదర్శులుగా షేక్ సర్దార్, నూర్, రాష్ట్ర ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా కొప్పాల భాస్కర్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శిగా యుగంధర్ రెడ్డి నియమితులయ్యారు.

కర్రలతో ఇరువర్గాల దాడులు
Comments
Please login to add a commentAdd a comment