
ఎస్వీయూలో జర్మనీ భాష అభ్యసన కేంద్రం!
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల శ్రీస్టడీ వింగ్స్ ఓవర్సీస్ సంస్థ సహకారంతో జర్మనీ భాష అభ్యసన కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప కులపతి కార్యాలయంలో స్టడీ వింగ్స్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం వర్సిటీ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు సమావేశమయ్యారు. వీసీ మాట్లాడుతూ.. జర్మనీలో విద్యా, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని కోసం వర్సిటీ నందు శ్రీస్టడీ వింగ్స్ టు ఓవర్సీస్ఙ్ సంస్థ సహకారంతో జర్మనీ అభ్యసన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సమావేశం అనంతరం సంస్థ ప్రతినిధులు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్టడీ వింగ్స్ సంస్థ ప్రతినిధులు నరేంద్ర రెడ్డి, వల్లేరు సుకన్య, అధ్యాపకులు, ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment