
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
తడ: జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీసిటీలోని ఐఐఐటీ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కర్ణాటకకు చెందిన విద్యార్థి ప్రత్యూష్ ఎంఆర్ (21) మృతిచెందాడు. ఎస్‌ఐ కొండపనాయుడు కథనం.. హోలీ సంబరాల కోసం రంగులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రత్యూష్ కళాశాలకు చెందిన స్కూటీపై సూళ్లూరుపేట వెళ్లాడు. సరుకులు కొనుగోలు చేసి తిరుగు పయనంలో కొండూరు చెరువు వద్దకు వచ్చే సరికి వెనుక వచ్చిన లారీ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రత్యూష్‌పై లారీ టైర్లు ఎక్కడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్‌ను ఆదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment