
భారీ స్కాంపై విచారణ
చంద్రగిరి: ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమ నిర్మాణం చేసిన షెడ్డుకు అధికారులు విద్యుత్ సోలార్ అమర్చడంపై అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రిలో స్వర్ణ నారావారిపల్లి క్లస్టర్‌లో భారీ స్కాం శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తిరుపతి రూరల్ డీఈ రెడ్డెప్ప తన సిబ్బందితో కలసి ఏ.రంగంపేట సమీపంలోని నాగపట్ల వద్ద అక్రమ నిర్మాణం చేపట్టిన షెడ్డును పరిశీలించారు. షెడ్డులో ఎలాంటి నివాసం లేకపోయినా విద్యుత్ సోలార్‌ను అమర్చడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏ ప్రాదిపదికన షెడ్డుకు సోలార్‌ను అమర్చారంటూ అధికారులను నిలదీశారు. సోలార్ ఏర్పాటుకు షెడ్డు యజమానులు ఎలాంటి పత్రాలను అందజేశారంటూ ఆయన ఆరాతీశారు.
Comments
Please login to add a commentAdd a comment