
గుంతలు బాబోయ్!
● అధ్వాన్నంగా గ్రామీణ రహదారులు ● సంక్రాంతి గడువు దాటినా మోక్షం లేని రోడ్లు ● పల్లెలకు వెళ్లే బాటలన్నీ గతుకుల మయం ● ప్రధానంగా పీఎన్ పేట– శ్రీకాళహస్తి మార్గంలో తప్పని అవస్థలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్రాంతి పండుగలోపు రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించింది. ఇంతలో పండుగ రానే వచ్చింది. గ్రామాలకు వచ్చిన వారు తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. అయినా రహదారులు మాత్రం బాగుపడలేదు. జిల్లాలో అక్కడక్కడ కొన్ని రహదారులకు కంకర, తారు అద్ది ఆ ఫొటోలను తమ అనుకూల పత్రికల్లో నాడు– నేడు అని ప్రచురించుకుని గొప్పలు చెప్పుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయమై అధ్వాన్నంగా మారాయి. ఆ మార్గంలో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. తరచూ ప్రమాదాల బారినపడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రేణిగుంట–పాపానాయుడుపేట రహదారిని సంక్రాంతికి ముందు హడావుడిగా వేశారు. బాగుచేసిన రహదారి దెబ్బతినకుండా.. ప్రమాదాలు జరుగకుండా రోడ్డు పటిష్టంగా ఉండేందుకు ఇరువైపులా గ్రావెల్ లేదా మట్టితో ‘సైడ్ బర్మ్’ ఏర్పాటు చేస్తారు. అయితే అటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వాహనాల రాకపోకల సమయంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న గుంతల్లో ఒరిగిపోయి ప్రమాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.
నరక ప్రయాణం
పాపానాయుడుపేట– శ్రీకాళహస్తి మార్గంలో పాడైన రహదారిని బాగుచేయాల్సింది పోయి.. దెబ్బతిన్న చోట్లంతా తవ్వేసి కంకరతో కప్పేశారు. శివరాత్రికి ముందు తవ్వేశారు. ఆ తరువాత తవ్వేసిన ప్రాంతాల్లో కంకరతో నింపేశారు. మరి కొన్ని చోట్ల గుంతలు ఉన్నా పూడ్చే కార్యక్రమం చేపట్టకలేదు. ఫలితంగా మర్రిమంద నుంచి ముసిలిపేడు వరకు సుమారు 10 కి.మీ నరకం కనిపిస్తోంది. వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కొందరు కంకర, గుంతల్లో పడిలేచి వెళ్లాల్సి వస్తోంది. గాజులమండ్యం సమీపంలోని ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి సూరప్పకశం, బ్రాహ్మణపట్టు వెళ్లే గ్రామీణ రహదారి పూర్తిగా ఛిద్రమైంది. ఈ ప్రాంతంలో ప్రయాణం ప్రమాదంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేణిగుంట మండలం జీ పాళెం వద్ద రోడ్డు దుస్థితి
పాపానాయుడుపేట– శ్రీకాళహస్తి మార్గంలో
అధ్వాన్నంగా ఉన్న రహదారి
శివరాత్రికి ముందు పాపానాయుడుపేట– శ్రీకాళహస్తి రహదారిలో
గుంతలు ఏర్పడిన పలు ప్రాంతాల్లో ఇలా తవ్వేశారు

గుంతలు బాబోయ్!

గుంతలు బాబోయ్!

గుంతలు బాబోయ్!
Comments
Please login to add a commentAdd a comment