
వినియోగదారుల హక్కులు
● కొనుగోలుదారుల చేతిలో పాశుపతాస్త్రం వినియోగదారుల చట్టం ● మోసపోయి ఆశ్రయిస్తే చాలు.. ● వస్తువులు, సేవల కేసుల పరిష్కారంలో ప్రధాన పాత్ర
తిరుపతి లీగల్ : వినియోగదారుల చేతిలో పాశుపతాస్త్రంగా వినియోగదారుల హక్కుల చట్టం పనిచేస్తోంది. లోప భూయిష్టమైన వస్తువులు, సేవల నుంచి రక్షణ కల్పిస్తోంది. మోసపోయిన బాధితులను అక్కున చేర్చుకుంటోంది. వారికి న్యాయం చేకూర్చి బాసటగా నిలుస్తోంది. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కమిషన్‌న్ పనితీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
వినియోగదారులు ఎవరంటే?
ఏదైనా వస్తువు, సేవలను ఉపయోగించుకునే వాళ్లు వినియోగదారులే. పది రూపాయలు వెచ్చింది ఏదైనా వస్తువు కొనుగోలుచేసినా, ఏదైనా ఒక సేవ పొందినా వాళ్లు వినియోగదారుల కిందకే వస్తారు. కొన్న వస్తువు సరిగా పనిచేయకపోయినా, పొందిన సేవలో లోపం ఉన్నా ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌న్ మెట్లెక్కవచ్చు. తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టు భవనాల సముదాయంలో జిల్లా వినియోగదారుల కమిషన్‌న్ ఉంది.
చట్టం పుట్టుక ఇలా..
వినియోగదారుల సంరక్షణ కోసం 1962 మార్చి 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనడి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1983 నుంచి మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. భారతదేశంలో 1986 డిసెంబర్ 24న ఈ చట్టానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టం 1988 నుంచి అమల్లోకి వచ్చింది.
ఫిర్యాదు చేయడం ఇలా..!
వివాద పరిహారం రూ.50 లక్షలకు లోబడి ఉన్నప్పుడు జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేయాలి. బాధితుడు నేరుగా కానీ, న్యాయవాది ద్వారా కానీ ఫిర్యాదు చేసుకోవచ్చు. కాల పరిమితి సంఘటన జరిగిన రెండేళ్లు లోపు ఉండాలి.
● వినియోగదారుల ప్రాణ, ఆస్తులకు హాని కలిగించే వస్తువులను మార్కెట్లో విక్రయించకుండా నిరసించే హక్కు
● కొనదల్చుకున్న వస్తువు విలువ, పరిమాణం, స్వచ్ఛత తెలుసుకునే హక్కు
● వస్తువులను దాని విలువ ముందుగా పరిశీలించుకునే హక్కు
● తనకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసే హక్కు
● ఆరోగ్యకరమైన పరిసరాలకు సంబంధించిన హక్కు
● హక్కులకు భంగం కలిగినప్పుడు పరిహారం పొందే హక్కు
ఫలప్రదం.. విని‘యోగం’!
చెల్లించాల్సిన ఫీజు
వినియోగదారుల కమిషన్‌లో పరిహారం విలువ ఐదు లక్షల రూపాయల లోపు అయితే ఎటువంటి ఫీజు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రూ.200, 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రూ.400, 20 లక్షల నుంచి 50 లక్షల వరకు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలి.
జరిమానాతో పాటు శిక్ష
వినియోగదారుల కమిషన్ తీర్పులను అమలు పరచని ప్రతివాదికి నెలకు తక్కువ కాకుండా మూడేళ్ల వరకు శిక్ష లేదా జరిమానా రూ.2 వేల నుంచి రూ.పది వేల వరకు పడుతుంది. లేదా శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
తిరుపతి జిల్లా
వినియోగదారుల కమిషన్
తిరుపతి ఎంఆర్ పల్లి సర్కిల్
సమీపంలోని అద్దె భవనంలో ఉంది
Comments
Please login to add a commentAdd a comment