‘కూటమి’!
ఇసుకాసురుల
● జిల్లాలో ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు ● రెండో దశలో గుర్తించిన ఇసుక రీచ్‌ల్లోనూ ఇబ్బడిముబ్బడిగా తవ్వకాలు ● పక్కాగా అమలయ్యేనాటికి అక్కడ ఇసుక ఉంటుందో లేదో?
తిరుపతి అర్బన్: ఉచిత ఇసుక మాటున కూటమి ప్రభుత్వం లబ్ధిదారులతో చెడుగుడు ఆడుతోంది. గత ఏడాది జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లాలో నామమాత్రంగా ఒక నెల మాత్రమే ఇసుక పంపిణీ చేసి చేతులు పైకెత్తేసింది. గత ఏడాది సెప్టెంబర్ 8 నుంచి ఇసుక లేక రీచ్‌లను మూత వేసింది. రెండు నెలల క్రితం గాజులమండ్యం, అవిలాల, కాటన్‌మిల్ వద్ద ఇసుక యార్డ్‌ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. వారు అన్నమయ్య జిల్లాలో ఇసుకను కొనుగోలు చేసి జిల్లాలో విక్రయాలు చేస్తున్నారు.
రెండో దఫా దోపిడీకి సిద్ధం
రెండో దఫా ఇసుక పాలసీని రేపో మాపో జిల్లాలో మొదలు పెట్టనున్నారు. గూడూరు ప్రాంతంలోని గూడలి సమీపం వద్ద ఒక పాయింట్, పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద రెండు ఇసుక పాయింట్లు గుర్తించారు. ఈ మూడు పాయింట్లలో 1,37,686 టన్నుల ఇసుక ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆయా పాయింట్ల వద్ద ఇసుక ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా ఎగువ కలవకూరు– దిగువ కలవకూరు మధ్యలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి ఇష్టారాజ్యంగా టీడీపీ నేతలు ఇసుక తరలించేస్తున్నారు. గూడలి పాయింట్ వద్ద ఉన్న ఇసుకలోనూ 50 శాతం ఇప్పటికే కూటమి నేతలు తరలించినట్లు తెలుస్తోంది. అధికారికంగా అమలయ్యే నాటికి అక్కడ ఇసుక ఉంటుందోలేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు ఏజెన్సీకి తవ్వకాల బాధ్యత
ఓ ప్రైవేటు ఏజెన్సీకి కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడు ఇసుక పాయింట్లలో తవ్వకాల బాధ్యతను అప్పగించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడు ఇసుక పాయింట్లలో ఒక టన్ను ఇసుకకు ఎంత చెల్లించాలో స్పష్టత లేదు. గతంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఇసుక పాలసీలో టన్ను ధర వెంకటగిరి మొగళ్లగుంట వద్ద రూ.590 చెల్లించాల్సి ఉండేది. అయితే ఏజెన్సీ పాత్ర ఏంటో స్పష్టంగా తెలియడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment