డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: అలిపిరి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లో 32వ బ్యాచ్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్, అలిపిరి డిపో మేనేజర్ సింగంహరిబాబు తెలిపారు. అలిపిరి డ్రైవింగ్ స్కూల్‌లో హెవీ లైసెన్స్ కోసం శిక్షణ పూర్తి చేసుకున్న 31వ బ్యాచ్‌కి సర్టిఫికేట్స్ అందించి వీడ్కోలు పలికారు. వారికి శిక్షణ పూర్తి చేసిన సర్టిఫికేట్స్‌ను అందించారు. అలాగే 32వ బ్యాచ్‌కి శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్‌తోపాటు మెకానిజంలోనూ పట్టుసాధించేలా శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 496 మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. 32వ బ్యాచ్‌ను శుక్రవారం ప్రారంభించామని చెప్పారు. ఈ నెల 20 నుంచి 33 బ్యాచ్‌కి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment