గ్యాసు..మోసమే బాసు
గ్యాస్ సిలీండర్లపై ముద్రితమైన బరువు తప్ప వాస్తవంగా ఎంత ఉందో చాలా మందికి అంచనా ఉండదు. వినియోగదారుని ఎదుట బరువు తూచాకే గ్యాస్ సిలిండర్‌ను అందించాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ప్లాంట్ స్థాయి నుంచే మోసాలు జరుగుతున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ నింపడానికి ముందు మీటర్ రీడింగ్ జీరో.. ఉందో లేదో గమనించాలి. బంకు సిబ్బంది మాటల్లో దింపి దృష్టి మరల్చి రీడింగ్ జంప్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అనుమానం వస్తే పెట్రోల్ బంకులోని ముద్రతో ఉన్న ఐదు లీటర్ల పరిమాణం గల కొలత పాత్ర ద్వారా సరిచూసుకోవచ్చు. ఇంధనం నాణ్యతమీద అనుమానం ఉంటే బంకు దగ్గర ఉన్న ఫిల్టర్ పేపర్ తీసుకుని పరిశీలించాలి.
Comments
Please login to add a commentAdd a comment