భవనం పైనుంచి పడి కార్మికుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

భవనం పైనుంచి పడి కార్మికుడి దుర్మరణం

Published Sun, Mar 16 2025 1:15 AM | Last Updated on Sun, Mar 16 2025 1:15 AM

భవనం పైనుంచి పడి  కార్మికుడి దుర్మరణం

భవనం పైనుంచి పడి కార్మికుడి దుర్మరణం

తిరుపతి క్రైమ్‌: భవనం పైనుంచి పడి ఒక కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి ఎస్‌ఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు.. గుంటూరుకు చెందిన అబ్రహం కుమారుడు దావీదు(56) శుక్రవారం సాయంత్రం ఆటోనగర్‌లో ఓ భవనం వద్ద పెయింట్‌ పనులు చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కాలుజారి కింద పడ్డాడు. అయితే దీనిని గమనించిన కార్మికులు వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దావీదు మృతి చెందాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వారి బంధువులకు సమాచారం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement