
తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తా
తిరుపతి అర్బన్: జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి అధికారి, పాఠశాల, ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ(ఐఏఎస్)కోన శశిధర్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి అధికారిగా కోన శశిధర్, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలసి అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఉపాధి కల్పనలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ చురుగ్గా పనిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు స్థానిక అవసరాలకు, రాష్ట్ర అవసరాలకు వీలుగా ఉండే పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు రామమోహన్, భానుప్రకాష్‌రెడ్డి, కిరణ్మయి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, డీపీఓ సుశీలాదేవి, డీఈఓ కేవీఎస్ కుమార్, ఎకై ్సజ్ జిల్లా అధికారి నాగమల్లేశ్వర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డీఏఓ ప్రసాద్‌రావు, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, మత్స్యశాఖ జిల్లా అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి
జిల్లా ఇన్‌చార్జి అధికారి కోన శశిధర్
తిరుపతి తుడా: స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా ఇన్‌చార్జి అధికారి కోన శశిధర్ పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వలంటీర్లు, మహిళ వర్సిటీ విద్యార్థినులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ టూరిజం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్వీయూ ఎన్టీఆర్ స్టేడియం నుంచి టౌన్‌క్లబ్ సర్కిల్ వరకు విద్యార్థులు, అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజంగా మార్చేందుకు విద్యార్థులు ప్లాస్టిక్ రహిత ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ‘రెడ్యూస్ – రీ యూస్ – రీ సైకిల్’ అనే ట్రిపుల్ ఆర్ విధానాన్ని సమాజం అవలంబించాలని కోరారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతికి ప్రథమ స్థానం వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. మహిళా వర్సిటీ వీసీ ఉమా మాట్లాడుతూ ప్లాస్టిక్ సమాజంలో విధ్వంసం సృష్టిస్తుందని, ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నిషేధించేందుకు ప్రతిన పూనాలన్నారు. ఎస్వీయూ వీసీ అప్పారావు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధాన రుగ్మత అయిన క్యాన్సర్ కారకంగా ప్లాస్టిక్ వాడకమేనని, సమాజం వీలైనంతవరకు ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం న్యూబాలాజీ కాలనీలో త్రిపుల్ ఆర్ సెంటర్‌ను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, మున్సిపల్, జిల్లా రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు డాక్టర్ పాకనాటి హరికృష్ణ, డాక్టర్ మునిలక్ష్మి, మునీంద్ర పాల్గొన్నారు.

తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తా
Comments
Please login to add a commentAdd a comment