
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి
తిరుపతి తుడా:జిల్లాలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు నివేధించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మట్లాడుతూ తడి,పొడి చెత్త వేరు చేయడం, డ్రైనేజ్‌లో చెత్త వేయడంతో దోమల ఉత్పత్తికి ఆవాసాలుగా మారుతా యని తెలిపారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛదివస్‌పై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శాంతకుమారి, అదన పు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, డిప్యూటి డీఎంహెచ్‌ఓ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ శ్రీనివాసరావ్, మలేరియా నివారణాధికారి డాక్ట ర్ రూప్‌కుమార్, వరలక్ష్మి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ తమ వంతుగా ప్రతి రోజూ కొంత సమయాన్ని కేటాయించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈఎస్‌ఐ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు పేర్కొన్నారు. ఆస్పత్రిలో శనివారం ఆయన డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఈఎస్‌ఐ లబ్ధిదారులతో కలసి ‘స్వచ్ఛాంధ్ర –స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment