టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం! | - | Sakshi
Sakshi News home page

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!

Published Sun, Mar 16 2025 1:15 AM | Last Updated on Sun, Mar 16 2025 1:16 AM

టర్మ్

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!

● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదంటే.. మాకేటి సంబంధం ● ఫీజు బకాయిలు చెల్లించి తీరాల్సిందే ● ఎస్వీయూలో విద్యార్థులకు అధికారుల హుకుం ● రంగంలోకి విద్యార్థి సంఘాలు.. అధికారుల తీరుపై ఆగ్రహం

మంత్రి మాట..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందలేదని కళాశాలలు విద్యార్థులను ఇబ్బంది పెట్టినా, ఫీజు కట్టాలని ఒత్తిడి చేసినా ఆ కళాశాలల భరతం పడతాం.. ఇదీ సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హెచ్చరిక.

ఎస్వీయూ తీరు

ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న టర్మ్‌ ఫీజు లు చెల్లిస్తేకాని పరీక్ష ఫీజు కట్టించుకోం. ఫీజురీయింబర్స్‌మెంట్‌ రాలేదంటే..మా కే టి సంబంధం. ఇదీ ఎస్వీయూ అధికారులు మంత్రి మాటలకు ఇచ్చిన విలువ.

ఇబ్బంది పెడితే ఊరుకోం

విద్యార్థులను ఇబ్బంది పెడితే ఊరుకోం. ఈ విషయమై ఇప్పటికే పలుసార్లు అధికారులను సంప్రదిం చాం. అధికారులు మొండివైఖరి మార్చుకుని పరీక్ష ఫీజును క ట్టించుకోవాలి. టర్మ్‌ ఫీజుకు ముడిపెడితే వి ద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు. వ ర్సిటీ అధికారులు వైఖరి మార్చుకోకపోతే విద్యార్థి సంఘాలతో కలసి ఉద్యమిస్తాం.

–చిన్న, ఏఐఎస్‌ఏ, జిల్లా కార్యదర్శి, తిరుపతి

జీవితాలతో ఆటలు దారుణం

టర్మ్‌ ఫీజు పేరుతో పరీక్ష ఫీజు కట్టించు కోకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవ డం దారుణం. ఎస్వీ యూ అధికారులకిది తగదు. పేద విద్యార్థులే 90 శాతం మంది వర్సిటీలో చదువుతున్నారు. వారు రూ.వేలు కట్టే పరిస్థితి లేదు. విద్యార్థులను టార్ఛర్‌ చేయడం దారుణం. –రంజిత్‌ కుమార్‌,

బీపీఈడీ విద్యార్థి, ఎస్వీయూ

ఫీజు కట్టలేని పరిస్థితి

పేద విద్యార్థులు ఒక్కసారిగా అంత ఫీజు కట్టే పరిస్థితిలేదు. అధి కారులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలే తప్ప, మాలాంటి పేద విద్యా ర్థులను ఇబ్బంది పెట్టడం సమంజంకాదు. స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌ మెంట్‌ నిధులు స్తంభించిపోయాయి. దీంతో ఒక్క రూపాయి సైతం చెల్లించలేనిస్థితి.

–వేణు, బీఈడీ విద్యార్థి, ఎస్వీయూ

తిరుపతి సిటీ: కళాశాల విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు గత ఏడాది నుంచి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దీంతో ఎస్వీయూలో ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలో పీజీ, బీపీఈడీ, బీఈడీ చదువుతున్న పేద విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. పెండింగ్‌లో ఉన్న ఫీజులు చెల్లించాలని కళాశాల అధికారులు ఒత్తిడి చే యడంతో పలుమార్లు అధికారులను బతిమ లాడినా కనికరించలేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి.

పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తాం

టర్మ్‌ ఫీజులు చెల్లించకుంటే సెమిస్టర్‌ పరీక్ష ఫీజును కట్టించుకోమని అధికారులు మొండి వైఖరి ప్రదర్శించడం దారుణమని ఏఐఎస్‌ఏ, పీడీఎస్‌యూ నాయకులు చిన్న, లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ప్రిన్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ స్కాలర్‌ షిప్‌లు ఇవ్వకపోతే టర్మ్‌ ఫీజులు ఎలా కడతామని ఆవేదన వ్యక్తం చేశారు. టర్మ్‌ ఫీజులతో సంబంధం లేకుండా వెంటనే పరీక్ష ఫీజులు కట్టించుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలసి పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఆగ్రహానికి గురికాక తప్పదు

పేద కుటుంబాల నుంచి వచ్చాం. రూ.వేల ల్లో టర్మ్‌ ఫీజులు చెల్లించాలంటే మాటలా..అ ప్పులు చేసే అవకాశం లేదు. అధికారు లు వెంటనే పరీక్ష ఫీజు కట్టించుకోవాలి.లేదంటే వి ద్యార్థుల ఆగ్రహానికి గురికాకతప్పదు. –వంశీ,

ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి, ఎస్వీయూ

మొండి వైఖరి మార్చుకోవాలి

పెండింగ్‌లో ఉన్న ఫీ జురీయింబర్స్‌ మెంట్‌ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ వాటితో సంబంధం లేకుండా టర్మ్‌ ఫీజు చెల్లించాల్సిందే నంటూ అధికారులు చెబుతున్నారు. పేద విద్యార్థులమైన మేము ఇప్పటికిప్పుడు రూ.వేలు ఎలా చెల్లించాలి. అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలి.

–ఈష, బీపీఈడీ విద్యార్థిని, ఎస్వీయూ

ఆంక్షలు విధిస్తే ఏం చేయాలి

వర్సిటీలో చదువుతోంది మా లాంటి పేదలే. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబ ర్స్‌, స్కాలర్‌షిప్‌లు రా లేదు.. వ స్తే కడతాం. టర్మ్‌ ఫీజు చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టాలంటూ ఆంక్షలు విధిస్తే ఏం చేయాలి.

–భవిత, బీపీఈడీ విద్యార్థి, ఎస్వీయూ

అందని ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. టర్మ్‌ ఫీజులు తప్పనిసరిగా చెల్లించాలని విద్యార్థులపై కళాశాలల అధికారులు ఒత్తిడి..వెరసి.. పేద విద్యార్థికి ఉన్నత విద్య భారమైంది. తీరా పరీక్ష ఫీజు చెల్లించాల్సిన సమయానికి ఎస్వీయూ అధికారులేమో పైసా వసూలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పలు కోర్సుల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

పరీక్ష ఫీజు కట్టించుకోం!

ఎస్వీయూలో త్వరలో ప్రారంభం కానున్న పీజీ రెండో సెమిస్టర్‌, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు దగ్గరపడుతోంది. దీంతో పీజీలోని అన్ని కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టేందు అధికారులను సంప్రదించగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న టర్మ్‌ ఫీజులు చెల్లిస్తేకాని పరీక్ష ఫీజు కట్టించుకోమంటూ హుకుం జారీ చేశారు. ఫీజురీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిపులు అందలేదని బతిమలాడినా వాటితో తమకు సంబంధం లేదని తెగేసి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం! 
1
1/7

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం! 
2
2/7

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం! 
3
3/7

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం! 
4
4/7

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం! 
5
5/7

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం! 
6
6/7

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం! 
7
7/7

టర్మ్‌ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement