అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
తిరుపతి అర్బన్: స్థానిక బస్టాండ్‌లోని దుకాణదారులు ప్రయాణికులకు వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ప్రజారవాణా అధికారి నరసింహులు తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా ఆయన శనివారం తిరుపతి బస్టాండ్‌లోని పలు దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటళ్లలో నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్లాస్టిక్‌ను వినియోగించకూడదని స్పష్టం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిషేధిత వస్తువులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, ఏటీఎం రామచంద్రనాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment