
గుంతలెప్పుడు పూడ్చుతారో?
పెళ్లకూరు: కొణతనేరి–కోనేటిరాజుపాళెం ఆర్‌అండ్‌బీ రహదారి మార్గం, ముమ్మాడ్డిగుంట గ్రామ సమీపాన రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడాయి. ఆదివారం ఓ కారు గుంతలో పడి ఇరుక్కుపోయింది. గత కొన్ని రోజులుగా ఈ గుంతల వల్ల స్కూల్ బస్సులు, ఆర్టీసీ సర్వీసులు కూడా నడవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో
గాయపడిన వ్యక్తి మృతి
చంద్రగిరి: మండలంలోని తొండవాడ వద్ద ఈ నెల 9న బైక్ ఢీకొని గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ గాంధీపురానికి చెందిన నారాయణ(45) 9న బైక్‌లో చంద్రగిరి నుంచి తిరుపతి వెళుతున్నాడు. తొండవాడ వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నారాయణను స్థానికులు 108లో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రెండు కార్ల ఢీ
చంద్రగిరి : పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై కాశిపెంట్ల వద్ద ఆదివారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. తిరుపతికి చెందిన భువానదిత్య, వరప్రసాద్, సాయికుమార్ వ్యక్తిగత పనులపై కారులో చిత్తూరు వైపునకు బయలుదేరారు. ఈ క్రమంలో కడప నుంచి కుప్పానికి వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొంది. దీంతో కడప నుంచి వస్తున్న కారులోని శ్రీనివాసన్, మంజునాథ, గీత, భాగ్యలక్ష్మి, సువార్త, అరవింద్ కుమార్‌తో పాటు తిరుపతికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. క్షగాత్రులను చంద్రగిరి ఏరియా ఆస్పత్రి, తిరుపతి రుయాకు తరలించారు.

గుంతలెప్పుడు పూడ్చుతారో?
Comments
Please login to add a commentAdd a comment