
జీజేఎల్‌ఏ జిల్లా అధ్యక్షుడిగా రవి
తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం(జీజేఎల్‌ఏ) తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా వి.రవి (చంద్రగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల) ఎన్నికయ్యారు. తిరుపతిలో ఆదివారం జీజేఎల్‌ఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా పి.రాజనాల, కార్యదర్శిగా సి.వంశీకృష్ణ (చంద్రగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల), సంయుక్త కార్యదర్శిగా టీఆర్.చక్రాధర్ (పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల), కోశాధికారిగా బి.అనిల్‌కుమార్ (సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల), లేడీ సెక్రటరీగా డాక్టర్ పి.అమ్ముదేవి (పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల), రాష్ట్ర కౌన్సిలర్లుగా డాక్టర్ కె.రవీంద్రబాబు (వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల), వీఎన్ రవి (వరదయ్యపాళెం ప్రభుత్వ జూనియర్ కళాశాల) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు జీసీజీటీఏ జిల్లా కార్యదర్శి ఎస్.శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment