
రేపటి నుంచి అన్నమయ్య సంకీర్తనోత్సవాలు
తిరుపతి కల్చరల్: శ్రీత్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు త్యాగరాజ మండపంలో అన్నమయ్య సంకీర్తనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ సుందరం, కంచి రఘురాం తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 80 ఏళ్లుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలను చేపడుతూ ప్రతిభావంతులైన ప్రముఖ విద్యాంసులచే త్యాగరాజ సంగీతోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్యకు క్రోధి నామ సంవత్సరం స్వామివారు సాక్షాక్తరించి ఆశీస్సులు అందించారన్నారు. ఆ పవిత్రమైన ఏడాదిని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు అంటే ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 9.30 గంటల వరకు ప్రముఖ విద్యాంసులచే అన్నమయ్య సంకీర్తన కచేరీలు ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment