
● వ్యవసాయానికి సక్రమంగా అందని విద్యుత్ ● 9 గంటల సరఫరా
సక్రమంగా ఇవ్వడం లేదు
వ్యవసాయానికి విద్యుత్‌ను ఏడు గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. అనేకసార్లు లైన్లు ట్రిప్ అవుతూ కరెంటు పోతోంది. మళ్లీ సిబ్బంది వచ్చి రిపేర్లు చేసే వరకు ఎదురు చూడాలి. నేను రెండెకరాల్లో వేసిన వేరుశనగ పంటకు సాగునీరు చాలడం లేదు. గతంలోనూ చంద్రబాబు కక్ష గట్టి మరీ రైతులపైనే కేసులు పెట్టించారు. కోతలు లేకుండా ఏడు గంటలైనా నిరంతరాయంగా వ్యవసాయ విద్యుత్ అందించాలి.
– మంగారెడ్డి, కె.వెంకటాపురం,
శ్రీకాళహస్తి మండలం
రేణిగుంట: జిల్లాలోని రైతులు ఎక్కువగా వ్యవసాయ బోర్లపైనే ఆధారపడి పంటల సాగు చేస్తున్నారు. ఇప్పటికే ముందస్తుగా నాటిన చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఆఖరి తడి అందించాల్సిన పరిస్థితి. ఈ సమయంలో విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు ప్రతి బోరు వద్ద ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టడంతో తరచూ లైన్లు ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే ట్రాన్స్‌కో సిబ్బంది చేయి తడపాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు సతమతమవుతున్నారు.
దగా చేస్తోంది
కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది. రైతులకు 9గంటలు నాణ్యమైన విద్యుత్‌ను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. అయితే ఇప్పుడు ఏడు గంటలకు తగ్గించేశారు. దీంతో ఆఖరి తడులకు సాగునీరు అందక పంటలు ఎండబెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా నాణ్యమైన విద్యుత్ అందించాలి.
– శంకర్‌రెడ్డి, రైతు సంఘం నేత, రేణిగుంట

● వ్యవసాయానికి సక్రమంగా అందని విద్యుత్ ● 9 గంటల సరఫరా

● వ్యవసాయానికి సక్రమంగా అందని విద్యుత్ ● 9 గంటల సరఫరా
Comments
Please login to add a commentAdd a comment