
రైల్లో నుంచి పడి యువకుడి మృతి
చిల్లకూరు: చిల్లకూరు మండలం, తీపనూరు సమీపంలో 33 ఏళ్లు ఉన్న గుర్తుతెలియని యువకుడు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చైన్నె వైపు వెళ్లే రైలులో నుంచి తీపనూరు సమీపంలో ఓ యువకుడు కింద పడిపోయాడు. ప్రయాణికులు గుర్తించి 100కు సమాచారం అందించారు. దీంతో వారు చిల్లకూరు పోలీసులను అప్రమత్తం చేశారు. తర్వాత 108 వాహనంలో యువకుడ్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. చిల్లకూరు పోలీసులు గూడూరు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు విచారణ చేస్తున్నారు. మృతునిది గుంటూరు ప్రాంతం అని రైల్వే పోలీసులు గుర్తించినా పూర్తి వివరాలు తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment