
అష్టబంధన మహా సంప్రోక్షణ
తిరుపతి కల్చరల్:అలిపిరి పాదాల మండపంలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం శాస్త్రోక్తంగా అష్ట బంధన మహా సంప్రోక్షణ నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం వద్దనున్న స్వామి వారి ఆలయం, శ్రీలక్ష్మీ నారాయణస్వామి వారి ఆల యానికి అనుబంధంగా ఉన్న శ్రీగోదా అమ్మవారి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కుంభ ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, రుత్వికులు పాల్గొన్నారు.
నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వండి
తిరుపతి అర్బన్: వినియోగదారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో జేసీ శుభం బన్సల్‌తోపాటు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిసోర్స్ పర్సన్ జనార్థన్‌తో కలిసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధర్వంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రిసోర్స్ పర్సన్ డా.యాసుఫ్, చెంచయ్య పాల్గొన్నారు.
‘క్షయ’పై అవగాహన తప్పనిసరి
తిరుపతి అర్బన్: క్షయవ్యాధి నిర్ధారణతోపాటు నివారణపై అవగాహన ఉండాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఈ నెల 24న ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్‌లో సోమవారం నిర్మూలనకు చెందిన ఓ బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్ధారణ, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందన్నారు. జిల్లాలో 24 పంచాయతీలను టీబీ ముక్త్ పంచాయతీలుగా గుర్తించినట్టు వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్, వైద్యులు శ్రీనివాసులురెడ్డి, సుబ్బారావ్, రవిరాజు, రాజా పాల్గొన్నారు.

అష్టబంధన మహా సంప్రోక్షణ

అష్టబంధన మహా సంప్రోక్షణ
Comments
Please login to add a commentAdd a comment