
తిరుపతికి నీటి సరఫరా, మురుగునీటి ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి నగరానికి నీటి సరఫరా, మురుగునీరు సెప్టేజ్, తుపాను నీటి పారుదల, పార్క్ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకాన్ సాహు తెలిపారు. సోమవారం ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
సెల్‌ఫోన్ రిపేర్, సర్వీసింగ్‌లపై ఉచిత శిక్షణ
చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 25 నుంచి 30 రోజుల పాటు పురుషులకు సెల్‌ఫోన్ రిపేరు, సర్వీసింగ్‌లపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న పురుషులు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి అని, శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని, రానూ పోనూ ఒక్కసారి చార్జీలు ఇస్తామన్నారు. అలాగే శిక్షణానంతరం ధ్రువ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు జెరాక్స్‌లు, 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని, తొలుత పేర్లు నమోదు చేసుకున్న ప్రాధాన్యత ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 94949 51289, 63017 17672 సంప్రదించాలని సూచించారు.
మధ్యవర్తిత్వంపై శిక్షణ
తిరుపతి లీగల్: రాష్ట్ర, జిల్లా న్యాయసేవా సంస్థల ఆదేశాల మేరకు తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 44 మంది న్యాయవాదులకు సోమవారం నుంచి మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. స్థానిక రాస్ భవనంలో జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమానికి తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం.గురునాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణ తరగతులు ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది అనుజ సక్సేన, మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త నీనాకరే మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి ఎమ్‌ఎస్ భారతి, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment