వేదాల పరిరక్షణకు కృషి
తిరుపతి సిటీ: గ్రామ స్థాయి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలలో వేదాల పరిరక్షణకు కృషి చేయాలని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి పిలుపునిచ్చారు. ఎస్వీ వేదిక్ వర్సిటీ, మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిష్ఠాన్ సంయుక్త ఆధ్వర్యంలో వేదిక్ వర్సిటీలో మూడు రోజుల వేద సమ్మేళనం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.వర్సిటీలో వేదపండితులు, అతిథులు, విద్యార్థులు పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. వేదాల రక్షణే లోకరక్షణగా భావించాలన్నారు. వేదాలతో జ్యోతిష్యం, పురాణాలు, ఇతిహాసాలు, నీతి శాస్త్రం, యోగ శాస్త్రం అనుసంధానం చేసి వాటి సారాన్ని సమాజానికి అందించాలన్నారు. విశిష్ట అతిథులు, ఎన్‌ఎస్‌యూ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, వేదిక్ వర్సిటీ వీసీ రాణిసదాశివమూర్తి, సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టానం సచివులు ఆచార్య విరూపాక్ష జడ్డీపాల్ ప్రసంగించారు. వేదాలు మానవ జీవన విధానాన్ని తెలియజేస్తాయని, వేద పరిరక్షణతోనే దేశ పరిరక్షణ సాధ్యమన్నారు. ధార్మిక చైతన్యం పెరగాలని, వేదం అభ్యసించిన వారు సైనికుల్లా దేశ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భాస్కరుడు, గణేష్‌భట్, పీఆర్‌ఓ టి.బ్రహ్మాచారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వేద పండితులు పాల్గొన్నారు.
కంచి కామకోటి పీఠాధిపతి
శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి పిలుపు
Comments
Please login to add a commentAdd a comment